close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్ర పదవీ విరమణ

ఈనాడు, హైదరాబాద్‌: సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా వి.ఎం. తివారీ నియమితులయ్యారు. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ డైరెక్టర్‌ అయిన తివారీ మంగళవారం ఇక్కడ అదనపు బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర సీసీఎంబీకి సలహాదారుగా వ్యవహరిస్తారు. కొవిడ్‌ మొదలైన తర్వాత గత ఏడాది మార్చి నుంచి రాకేశ్‌ మిశ్ర ఎప్పటికప్పుడు ప్రజలు, ప్రభుత్వానికి సమాచారాన్ని అందించి అప్రమత్తం చేశారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణ, కృత్రిమంగా వైరస్‌ అభివృద్ధి, వాటిపై ఔషధాల ప్రయోగాలు, కొత్త కిట్ల రూపకల్పన వరకు ఏడాది కాలంలో సీసీఎంబీ చేసిన కృషిలో ఆయన ముఖ్య భూమిక పోషించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు