close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా చెన్నారెడ్డి, హరిప్రసాదరెడ్డి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషనర్లుగా న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డి, పాత్రికేయుడు ఉల్చాల హరిప్రసాదరెడ్డిలను ముఖ్యమంత్రి జగన్‌ సారథ్యంలోని కమిటీ ఎంపిక చేసింది. ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశం మంగళవారం సచివాలయంలోని సీఎం కార్యాలయంలో జరిగింది. ముఖ్యమంత్రి జగన్‌తోపాటు హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు. చెన్నారెడ్డి, హరిప్రసాదరెడ్డి పేర్లను కమిటీ ఎంపిక చేసి గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు