close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏపీ బాలికకు కవిత ఆపన్నహస్తం

వెన్నెముక వ్యాధికి శస్త్రచికిత్సకు సాయం

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన పదకొండేళ్ల నిరుపేద బాలిక చిమ్మిలి జ్ఞాపికకు తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆపన్నహస్తం అందించారు. తమ సొంత ఖర్చుతో హైదరాబాద్‌ నిమ్స్‌లో వెన్నెముక వ్యాధికి శస్త్రచికిత్స చేయించారు. నిమ్స్‌లో గత నెలలో చేరిన బాలికకు శస్త్రచికిత్సకయ్యే డబ్బుల్లేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని  కొందరు నెటిజన్లు ట్విటర్‌ ద్వారా కవిత దృష్టికి తెచ్చారు. ఆమె వెంటనే జ్ఞాపిక కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. జ్ఞాపికకు తాను శస్త్రచికిత్స చేయిస్తానని భరోసా ఇచ్చారు. నిమ్స్‌ వైద్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేయించారు. వారం క్రితం వైద్యలు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. కోలుకోవడంతో జ్ఞాపిక మంగళవారం నిమ్స్‌ నుంచి డిశ్చార్జి అయింది. ఈ సమాచారం తెలుసుకొని జ్ఞాపికకు కవిత శుభాకాంక్షలు తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు