కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు మృతి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు మృతి

ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు, సీఏఏ బిల్లుల రూపకల్పనలో కీలకపాత్ర

ఈనాడు, దిల్లీ: కేంద్ర న్యాయ శాఖలో శాసన వ్యవహారాల విభాగం కార్యదర్శి డాక్టర్‌ జి.నారాయణరాజు(62) కరోనాతో కన్నుమూశారు. కొవిడ్‌తో బాధపడుతున్న ఆయన దిల్లీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు. నెల్లూరు జిల్లాకు చెందిన నారాయణరాజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాలలో చదువుకున్నారు. కొన్నాళ్ల పాటు భీమవరంలో అధ్యాపకుడిగా పనిచేశారు. న్యాయశాఖలో 2015 నుంచి పనిచేసి, శాసన వ్యవహారాల కార్యదర్శిగా... జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాఖ్‌, సీఏఏ బిల్లుల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేసే నాటికి కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ సభ్యునిగా నియమితులయ్యారు. ఆయన సమర్థతను గుర్తించిన కేంద్రం పదవీ కాలాన్ని రెండేళ్ల పాటు పొడిగించి శాసన వ్యవహారాల కార్యదర్శిగా కొనసాగిస్తోంది. రాజు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

వినోద్‌కుమార్‌ సంతాపం
ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర న్యాయ (లెజిస్లేచర్‌) శాఖ కార్యదర్శి, భారత న్యాయసేవల అధికారి నారాయణరాజు మృతిపై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  ఆయన కేంద్రాన్ని ఒప్పించి.. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు ప్రతిపాదనలను విభజన చట్టంలో చేర్పించారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు