గ్లైఫోసెట్‌ అమ్మకాలపై నిషేధం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్లైఫోసెట్‌ అమ్మకాలపై నిషేధం

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: కలుపు మొక్కలను చంపడానికి చల్లే గ్లైఫోసెట్‌ వినియోగం, అమ్మకాలపై నియంత్రణ విధిస్తూ వ్యవసాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏ పంటపైనగానీ, ఏ పొలంలోగానీ దీన్ని చల్లరాదని స్పష్టం చేసింది. పంటలు లేని మైదాన ప్రాంతాల్లో గడ్డి మొక్కలు, కలుపు మొక్కలపైన మాత్రమే ఈ మందును పిచికారీ చేయాలని సూచించింది. వాటిని అమ్మినవ్యాపారిపై, కొన్న రైతులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మందు వాడకం వల్ల రైతుల, కూలీల ఆరోగ్యం కూడా నాశనమవుతోంది. చల్లేటప్పుడు వారి శరీరంలోకి వెళితే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముంది. దీని వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారులను వ్యవసాయశాఖ ఆదేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు