కరోనా నియంత్రణకు ప్రత్యేక కమిటీలు: డీజీపీ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నియంత్రణకు ప్రత్యేక కమిటీలు: డీజీపీ

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు శాఖలో కరోనా నియంత్రణకు కమిషనరేట్‌, ఎస్పీ కార్యాలయాలతోపాటు ప్రతి విభాగంలోనూ ప్రత్యేకంగా ఆరోగ్య పరిరక్షణ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. కరోనా నియంత్రణపై బుధవారం ఆయన ఎస్పీలు, కమిషనర్లతోపాటు ఇతర ఉన్నతాధికారులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రతి విభాగంలోనూ కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారితో వాట్సప్‌ గ్రూపులు రూపొందించామన్నారు. వారికి ఆత్మస్థైర్యం కలిగించేలా ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వడంతోపాటు వైద్యులు సూచనలు ఇస్తారన్నారు. ఈ గ్రూపుల్లో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌.హెచ్‌.ఒ.) నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకూ ఉండాలని, కరోనా సోకిన పోలీసులందరికీ మందులు, డ్రైఫ్రూట్స్‌ వంటివి అందించాలని డీజీపీ ఆదేశించారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సమీపంలోని ఆసుపత్రిలో చేర్చాలన్నారు. డీజీపీ కార్యాలయం స్థాయిలోనూ ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌ రూపొందించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంటామన్నారు. రాష్ట్రంలోని హోంగార్డుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు అదనపు డీజీ (హోంగార్డ్స్‌) ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు