వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పీఠాధిపతి బ్రహ్మైక్యసిద్ధి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పీఠాధిపతి బ్రహ్మైక్యసిద్ధి

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఏడో తరం పీఠాధిపతి శ్రీవీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి (75) శనివారం బ్రహ్మైక్యసిద్ధి చెందారు. ఆయనకు కరోనా సోకడంతో కడపలో చికిత్స పొందారు. నెగెటివ్‌ వచ్చాక స్వగృహానికి చేరుకున్నారు. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 1946లో జన్మించిన ఆయన 1969లో మఠం పీఠాధిపతి అయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు