సిద్ధమవుతోన్న యాదాద్రి యాగస్థలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిద్ధమవుతోన్న యాదాద్రి యాగస్థలి

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో హోమాల నిర్వహణకు 90 ఎకరాల స్థలం సిద్ధమవుతోంది. గండి చెరువు సమీపంలో ప్రభుత్వం కేటాయించిన ప్రాంతాన్ని ఎర్రమట్టితో నింపి భారీ యంత్రాలతో అధికారులు చదును చేయించారు. యాదాద్రిలో ప్రధానాలయ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌ సుదర్శన నారసింహ మహాయాగం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖ వ్యక్తులు, మహావిద్వాంసులు, పండితులు, జీయర్లు, ఆచార్యులను ఆహ్వానించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వైటీడీఏ అధికారులు తెలిపారు. అందుకు అనువుగా ఈ స్థలాన్ని సుందరవనంలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు నాటుతున్నారు. వివిధ డిజైన్‌లతో పూలమొక్కలు నాటే ప్రక్రియ పూర్తి చేశారు. ప్రహరీ నిర్మించి.. అందులో చుట్టూ స్వామి, అమ్మవార్లకు సంబంధించిన శ్లోకాలతో కూడిన బోర్డులు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేస్తారు. చిన్నచిన్న పిల్లర్లు నిర్మించి, వాటిపై నరసింహస్వామికి సంబంధించిన విగ్రహాలను ఏర్పాటుచేసే ప్రణాళిక ఉన్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. ప్రధానాలయాన్ని ప్రారంభించే ముందు నిర్వహించే పంచ కుండాత్మక యాగాన్ని కూడా ఇక్కడే జరపనున్నట్లు వెల్లడించారు.
23 నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో స్తంభోద్భవుడైన నరసింహస్వామి జయంతి మహోత్సవాలు ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్నాయి. బాలాలయంలో 23న ఉత్సవ శ్రీకారం, 25న జయంతి మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు