రెడ్‌క్రాస్‌ సేవలు విస్తృతం చేయాలి: గవర్నర్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెడ్‌క్రాస్‌ సేవలు విస్తృతం చేయాలి: గవర్నర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని, కరోనా తీవ్రత దృష్ట్యా రోగులకు సేవలు అందిస్తూ అండగా నిలవాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆమె పుదుచ్చేరి నుంచి తెలంగాణ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ, ప్రస్తుత కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రతిఒక్కరూ ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని