పది రోజుల వ్యవధిలోనే అన్నదమ్ముల బలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పది రోజుల వ్యవధిలోనే అన్నదమ్ముల బలి

 ఒకరు జిమ్‌ మాస్టర్‌.. మరొకరు వ్యాయామ ఉపాధ్యాయుడు

మూసాపేట, న్యూస్‌టుడే:   కొవిడ్‌తో పది రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములు మృతి చెందిన విషాద సంఘటన ఇది. మృతుల్లో ఒకరు జిమ్‌ మాస్టర్‌ కాగా.. మరొకరు వ్యాయామ ఉపాధ్యాయుడు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం కాసర్లపాడుకు చెందిన ముగ్గురు సోదరులు బోనాల పరంజ్యోతి, నిరీక్షణ్‌రావు, పాపారావు కుటుంబాలు 20 ఏళ్ల క్రితం మూసాపేట పరిధిలోని భరత్‌నగర్‌కు వలస వచ్చాయి. వీరిలో నిరీక్షణ్రావు(50) స్థానికంగా ఓ జిమ్‌ నిర్వహిస్తుండగా.. పాపారావు(45) భరత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి(పీఈటీ)గా పనిచేస్తున్నారు. కరోనా సోకడంతో గాంధీ ఆసుపత్రిలో చేరిన నిరీక్షణ్‌రావు.. చికిత్స పొందుతూ గతనెల 29న ప్రాణాలు విడిచారు. అన్న అంత్యక్రియల సమయంలో అన్నీ తానై వ్యవహరించిన తమ్ముడు పాపారావు ఈ నెల 1న పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. శనివారం కుటుంబసభ్యులు చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. పాఠశాల మూతపడి జీవనం దుర్భరం కావడంతో మిత్రుల ఆర్థిక సహకారంతో పాపారావు భరత్‌నగర్‌లోనే టీ కొట్టు ఏర్పాటుచేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిరీక్షణ్‌రావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, పాపారావుకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని