పాస్‌పోర్టు సేవల నిలిపివేత
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాస్‌పోర్టు సేవల నిలిపివేత

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పాస్‌పోర్టు సేవలను నిలిపివేసినట్లు హైదరాబాద్‌ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 నుంచి 21 వరకు సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంతోపాటు రాష్ట్రంలోని పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, లఘుకేంద్రాలు, పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు కేంద్రాల్లో అన్ని సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలోని విదేశీ వ్యవహారాలశాఖకు చెందిన బ్రాంచ్‌ సెక్రటేరియేట్‌ కార్యకలాపాలనూ నిలిపివేస్తున్నట్లు వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు