శ్రీశైలంలో ఆన్‌లైన్‌ సేవలకు విశేష ఆదరణ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీశైలంలో ఆన్‌లైన్‌ సేవలకు విశేష ఆదరణ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆన్‌లైన్‌ సేవలకు విశేష ఆదరణ లభిస్తోంది. కొవిడ్‌ కారణంగా గత ఏడాది ఇదే సమయంలో వాటిని దేవస్థానం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈ నెల 9 వరకు 20,634 మంది ఆన్‌లైన్‌ సేవల్లో పాల్గొన్నారు. దేవదేవులకు 10 రకాల వరకు ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో జరిపించుకున్నారు. ఒక్కో సేవకు రూ.1,116ను గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, భీంయాప్‌ ద్వారా చెల్లిస్తే భక్తుల గోత్ర నామాలపై ఆలయ అర్చకులు శ్రీస్వామి అమ్మవార్ల ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. వాటిని భక్తులు యూట్యూబ్‌లో చూసుకునే అవకాశాన్ని  దేవస్థానం ప్రత్యేకంగా కల్పించింది. తితిదే తర్వాత ఒక్క శ్రీశైల దేవస్థానానికే ‘శ్రీశైల టీవీ’ ఉండటంతో భక్తులు అందులోనూ సేవలను వీక్షించే భాగ్యం కలుగుతోంది. ఆన్‌లైన్‌ సేవల వివరాలు తెలుసుకోవడానికి దేవస్థానం కాల్‌సెంటర్‌ నంబర్లు 83339 01351, 52, 53, 54, 55, 56లను సంప్రదించవచ్చని ఈవో కె.ఎస్‌.రామారావు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని