రైల్వే సెంట్రల్‌ ఆసుపత్రిలో తాత్కాలిక సిబ్బంది నియామకాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైల్వే సెంట్రల్‌ ఆసుపత్రిలో తాత్కాలిక సిబ్బంది నియామకాలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే సెంట్రల్‌ ఆసుపత్రి, లాలాగూడలో పారామెడికల్‌ సిబ్బందిని తాత్కాలికంగా తీసుకోవాలని నిర్ణయించింది. నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంÆట్లు, హాస్పిటల్‌ అటెండెంట్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. కొవిడ్‌-19 రోగులకు ప్రత్యేకించి క్వారంటైన్‌, ఐసొలేషన్‌ వార్డులలో సేవలు అందించాల్సి ఉంటుందని ద.మ.రైల్వే స్పష్టం చేసింది. తాత్కాలిక ఉద్యోగుల సేవల్ని 2022 మార్చి 31 వరకు ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. పోస్టులు, జీతభత్యాలు, అర్హతలు, దరఖాస్తు వివరాలకు www.scr.indianrailways.gov.in వెబ్‌సైట్‌ చూడాలని.. దరఖాస్తులకు ఆఖరితేదీ మే 15 అని పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని