పశువైద్యులకు వెంటనేటీకాలు ఇప్పించండి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పశువైద్యులకు వెంటనేటీకాలు ఇప్పించండి

కలెక్టర్లకు డైరెక్టర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: పశు వైద్యులు, సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా ‘భారత పశువైద్య మండలి’(వీసీఐ) గుర్తించిందని, వారందరికీ వెంటనే టీకాలు ఇప్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు పశుసంవర్ధకశాఖ రాష్ట్ర డైరెక్టర్‌ వి.లక్ష్మారెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతి జిల్లాలో ఈ టీకాలు వేయించాలని కోరారు. ఇప్పటికే కొంతమంది సిబ్బంది కరోనాబారిన పడ్డారని ఆయన తెలిపారు. మరోపక్క సిబ్బంది అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలని లక్ష్మారెడ్డికి రాష్ట్ర పశువైద్య పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చినట్లు సంఘం అధ్యక్షుడు కాటం శ్రీధర్‌ చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని