లాక్‌డౌన్‌లోనూ రెండో డోస్‌ టీకా: డీహెచ్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌లోనూ రెండో డోస్‌ టీకా: డీహెచ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించినా 45 ఏళ్లు పైబడిన అర్హులందరికీ కొవిడ్‌ టీకా రెండో డోస్‌ పంపిణీ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.జి.శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే వ్యాక్సిన్‌ కేంద్రాలన్నింటిలోనూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు. కొవాగ్జిన్‌ టీకా తొలి డోస్‌ పొంది 4 వారాలు, కొవిషీల్డ్‌ అయితే ఆరు వారాలు దాటిన తర్వాత రెండో డోస్‌ తీసుకోవాలని సూచించారు. గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నారు. టీకా కోసం వెళ్లే వారికి సహకరించాలని పోలీసులను కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని