తల్లి మరణించిన 24 గంటల్లోనే కుమారుడు..
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తల్లి మరణించిన 24 గంటల్లోనే కుమారుడు..

హోం ఐసొలేషన్‌లో నలుగురు కుటుంబసభ్యులు

పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపహడ్‌కు చెందిన ఓ కుటుంబంలో ఆరుగురు వైరస్‌ బారిన పడగా.. తల్లి, కుమారుడు 24 గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేసే నర్రా లక్ష్మీనారాయణ(45)కు 15 రోజుల క్రితం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయిదారు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ క్రమంలో ఆయన తండ్రి, తల్లి సీతారావమ్మ (68), భార్య, కుమార్తె, సోదరుడూ కరోనా బారిన పడ్డారు. సీతారావమ్మ(68)ను నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. తల్లి మరణించిన 24 గంటల్లోనే లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మిగిలిన నలుగురు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని