నిర్ధారణ పరీక్షకు వచ్చి.. అక్కడే కన్నుమూత
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్ధారణ పరీక్షకు వచ్చి.. అక్కడే కన్నుమూత

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: కరోనా నిర్ధారణ పరీక్షకు వచ్చిన యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన కందుల చిరంజీవి(35) వ్యవసాయ బావులు తవ్వే పనిచేస్తుండేవాడు. వారం రోజుల క్రితం జ్వరం వచ్చింది. మందులు వాడినా తగ్గకపోవడంతో ములుకనూర్‌ పీహెచ్‌సీకి వచ్చాడు. ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్ష కోసం నమూనా సేకరిస్తుండగా.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆసుపత్రి వైద్యాధికారి ప్రదీప్‌ పరీక్షించి ఎంజీఎం ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనానికి సమాచారమిచ్చారు. సిబ్బంది 108 వాహనంలో ఆక్సిజన్‌ అందించేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే చనిపోయినట్లు వైద్యాధికారి ధ్రువీకరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు