నీటిపాలైన ధాన్యం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీటిపాలైన ధాన్యం

పెద్దపల్లి కలెక్టరేట్‌, నర్సింహులపేట, దంతాలపల్లి, దేవరకద్ర, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపై ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, కమాన్‌పూర్‌, పాలకుర్తి, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, మండలాల్లో భారీ ఎత్తున ధాన్యం నీట మునిగింది. కమాన్‌పూర్‌ మండలం గుండారం కొనుగోలు కేంద్రంలో పిడుగుపడి కిష్టయ్య అనే రైతు మృతిచెందారు.  ఎలిగేడు, దూళికట్ట తదితర ప్రాంతాల్లో 11 విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయినట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాలో కొన్ని చోట్ల స్తంభాలు నేలకూలగా.. రోడ్లపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు కొంత ఆటంకం కలిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌కు అమావాస్య సందర్భంగా సెలవు కావడంతో రైతులు ముందురోజు తెచ్చి ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. సుమారు 40 బస్తాల వరకు వర్షం నీళ్లలో కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసి రంగు మారిన ధాన్యాన్ని సైతం కొంటామని పెద్దపల్లి అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని