అపార్ట్‌మెంట్లలోనే ఐసొలేషన్‌ కేంద్రాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అపార్ట్‌మెంట్లలోనే ఐసొలేషన్‌ కేంద్రాలు

స్వల్ప లక్షణాలున్నవారికి అక్కడే చికిత్స
గవర్నర్‌ తమిళిసై సూచన

ఈనాడు, హైదరాబాద్‌: ఎక్కడికక్కడ కాలనీలు, అపార్ట్‌మెంట్లలో ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని స్వల్ప లక్షణాలున్నవారికి, ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్‌ వచ్చినవారికి వసతి సౌకర్యం కల్పించాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. ఆసుపత్రుల్లో కరోనా రోగుల తాకిడి వల్ల వైద్యసిబ్బంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు. వ్యాధి లక్షణాలున్న, వైద్యం అవసరమైనవారికి ఆసుపత్రుల్లో సేవలందాలంటే.. స్వల్ప లక్షణాలున్నవారికి ఐసొలేషన్‌ కేంద్రాల్లో చికిత్సను కొనసాగించాలన్నారు. రాజ్‌భవన్‌ కమ్యూనిటీహాల్‌లో గురువారం ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసిన ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్లు సజ్జనార్‌, అంజనీకుమార్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి విశాల్‌ ఆర్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని