దేశంలోనే శ్రీమంతురాలివి...
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలోనే శ్రీమంతురాలివి...

పింఛన్‌ విరాళంగా అందించిన అంధురాలిపై సోనూసూద్‌ ప్రశంసలు

వరికుంటపాడు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అండ్రావారిపల్లెకు చెందిన అంధురాలు బొడ్డు నాగలక్ష్మి సేవానిరతిని చాటుకున్నారు. తన అయిదు నెలల పింఛన్‌ మొత్తం రూ.15 వేలు సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళంగా అందించినట్లు గురువారం తెలిపారు. సోనూసూద్‌ను కలిసే అవకాశం వస్తే తాను దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెబుతున్నారు. ఈ సాయంపై సోనూసూద్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘నాగలక్ష్మి దేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఇతరుల బాధను చూడడానికి కళ్లు అక్కరలేదు.. మంచి మనసుంటే చాలు’ అని కొనియాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని