వ్యవసాయ బోర్లకు మీటర్లు వద్దు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యవసాయ బోర్లకు మీటర్లు వద్దు

మరోసారి వెల్లడించనున్న తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ బిల్లు 2021 ముసాయిదాపై కేంద్రం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరిస్తోంది. అన్ని భాగస్వామ్య పక్షాలు అభిప్రాయాలు వెల్లడించటానికి మే 31 వరకూ కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ గడువు విధించింది. శుక్రవారం నిపుణుల కమిటీకి తెలంగాణ తన వాదనను మరోమారు వెల్లడించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ట్రాన్స్‌కో, జెన్‌కో జేఎండీ శ్రీనివాసులు హైదరాబాద్‌ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొని వివరిస్తారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని, విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రాంతాలవారీగా ప్రయివేటు పరం చేయాలనే ప్రతిపాదనలను తెలంగాణ ఇప్పటికే పలు దఫాలుగా వ్యతిరేకించింది. శుక్రవారం నిర్వహించే సమావేశంలో జెఎండీ ఇవే అంశాలను పునరుద్ఘాటించనున్నారని తెలిసింది.
ఇతర రాష్ట్రాలు కూడా..
నిపుణుల కమిటీ మెంబర్‌ కన్వీనర్‌ ఘనశ్యామ్‌ ప్రసాద్‌ శుక్రవారం ముందుగా ప్రజంటేషన్‌ ఇస్తారు. అనంతరం అభిప్రాయాలను వెల్లడించటానికి ప్రాంతాల వారీగా ఆయా రాష్ట్రాలకు సమయం కేటాయించారు. విద్యుత్‌ సరఫరా, పంపిణీ, గ్రిడ్‌ ఆపరేషన్‌, పవర్‌ మార్కెట్‌, విద్యుత్‌ రెగ్యులారిటీ విధానం తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని