డీఐజీ సుమతికి అసోచామ్‌ పురస్కారం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డీఐజీ సుమతికి అసోచామ్‌ పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మహిళా భద్రత విభాగం డీఐజీ సుమతి అసోచామ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ‘మహిళలకు సైబర్‌ భద్రత’ అంశంలో సుమతి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గురువారం ‘ఉమెన్‌ ఇన్‌ సైబర్‌: మేకింగ్‌ ఎ డిఫరెన్స్‌’ పేరిట నిర్వహించిన ఆన్‌లైన్‌ సదస్సుకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి జ్యోతి అరోరా ముఖ్యఅతిథిగా హాజరై సుమతికి ఈ పురస్కారాన్ని అందజేశారు.
10 వేల మందికి ‘సేవా ఆహార్‌’
తెలంగాణ మహిళా భద్రత విభాగం పోలీసులు ‘సేవా ఆహార్‌’ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 10 వేల మంది కొవిడ్‌ రోగులకు ఆహారాన్ని అందించారు. కరోనా బారిన పడి, హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి ఆకలి బాధలు తీర్చేందుకు తెలంగాణ మహిళా భద్రత విభాగం.. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ‘సేవా ఆహార్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద బాధితుల ఇళ్ల వద్దకే నిత్యం ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు