రుయా ఘటనపై ప్రాథమిక నివేదిక సమర్పణ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రుయా ఘటనపై ప్రాథమిక నివేదిక సమర్పణ

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతి రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు మృతిచెందిన ఘటనపై ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జయభాస్కర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ప్రాథమిక నివేదిక సమర్పించింది. గత రెండు రోజులుగా ఆ రోజు విధుల్లో ఉన్న వారి నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఆ మేరకు తయారు చేసిన ప్రాథమిక నివేదికను డీఎంఈకి సమర్పించారు. దీనిపై ఎస్వీఎంసీ ప్రిన్సిపల్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. ‘ఘటనకు సంబంధించి వివరాలు సేకరించి నివేదించాం. తప్పు ఎవరిదనేది నివేదికలో చెప్పలేదు. ఎవరిపై చర్యలు తీసుకుంటారో నాకు సంబంధం లేని విషయం’ అని  చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని