‘సింగరేణి థర్మల్‌’ మరో ఘనత
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సింగరేణి థర్మల్‌’ మరో ఘనత

ఏప్రిల్‌లో 98.57% పీఎల్‌ఎఫ్‌ నమోదు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, జైపూర్‌: మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద ఉన్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(ఎస్టీపీపీ) జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటింది. ఏప్రిల్‌లో 98.57 శాతం పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) సాధించి, జాతీయ స్థాయిలో ఉన్న 25 అత్యుత్తమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. గతంలోనూ ఈ తరహాలో పలు విజయాలు సాధించింది. ప్రారంభమైన కొన్ని నెలల్లోనే 2017-18లో 5వ స్థానంలో నిలిచింది. మూడు సార్లు నూరుశాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించింది. ఇప్పటివరకూ ఈ కేంద్రం 39,946 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా, 37,533 ఎంయూలను రాష్ట్ర అవసరాలకు సరఫరా చేసింది. సింగరేణిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సంస్థ చైర్మన్‌, సీఎండీ శ్రీధర్‌ అభినందనలు తెలిపారు. ఇకపైన కూడా ఉత్పత్తిలో గణనీయమైన ప్రతిభ చాటాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని