Corona: 29 రోజులకు రూ.24 లక్షల బిల్లు!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: 29 రోజులకు రూ.24 లక్షల బిల్లు!

ఈనాడు, హైదరాబాద్‌: నాగోలు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితుడి వైద్య ఖర్చులకు వేసిన బిల్లు చూసి బాధితుడి గుండె గుభేల్‌మంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో ఏప్రిల్‌ 15న ఈ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గురువారం డిశ్ఛార్జి చేసే ముందు రూ. 24 లక్షల బిల్లు చేతికిచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకు కొవిడ్‌ బాధితుడికి ఐసీయూకు రూ. 9,000, ఆక్సిజన్‌ బెడ్‌కు రూ.7000, సాధారణ వార్డుకు రూ.4000 చొప్పున మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మాత్రం రూ.24 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపుతామని స్పష్టం చేయడంతో బంధువులు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని