కోళ్లఫారాలపై అత్యవసర నివేదిక కోరిన సర్కారు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోళ్లఫారాలపై అత్యవసర నివేదిక కోరిన సర్కారు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్న కోళ్ల(పౌల్ట్రీ) ఫారాలు, వాటిపై విధిస్తున్న పన్నులపై ఒక్క రోజులో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అధికారులను ఆదేశించింది. మొత్తం సమాచారాన్ని ఒకే నమూనాలో శుక్రవారం ఉదయం పది గంటలలోగా అందించాలని సూచించింది. అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు ఆ నమూనాను పంపించింది. డీపీవోలు తమ పరిధిలోని డివిజనల్‌ అధికారు(డీఎల్‌పీవో)లు, మండల పరిషత్‌ అధికారు(ఎంపీవో)లు, పంచాయతీ కార్యదర్శులకు ఈ సమాచారాన్ని పంపి, కోరిన వివరాలను అత్యవసరంగా సేకరించాలని స్పష్టం చేసింది. గ్రామాల నుంచి సేకరించిన సమాచారాన్ని మండల, జిల్లా స్థాయిల్లో క్రోడీకరించి హైదరాబాద్‌కు పంపించాలని ఆదేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని