బోర్డు ముందుకు నాలుగు కీలకాంశాలు!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బోర్డు ముందుకు నాలుగు కీలకాంశాలు!

ఈ నెల 25న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

ఈనాడు హైదరాబాద్‌: నాలుగు కీలకాంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చర్చించనుంది. బోర్డుకు అవసరమైన నిధులు విడుదలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య కొంతకాలంగా తేలకుండా ఉన్న అంశాలను ఈ నెల 25న జరిగే సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు ఎజెండాను బోర్డు రెండు రాష్ట్రాలకు పంపింది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశంలో బోర్డు ఛైర్మన్‌ పరమేశం, కార్యదర్శి డి.ఎం.రాయపురే, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు రజత్‌కుమార్‌, మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ అధికారులు శ్యామలరావు, నారాయణరెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు.  బోర్డు నిర్వహణకు అయ్యే ఖర్చును రెండు రాష్ట్రాలు చెరి సగం భరించాల్సి ఉంది. 2020-21లో రూ.8.37 కోట్లకు గాను తెలంగాణ రూ.3.5 కోట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండేళ్లుగా నిధులు రాలేదని ఎజెండాలో పేర్కొన్నారు. 2021-22లో బోర్డు బడ్జెట్‌ రూ.18 కోట్లు కాగా ఇప్పటివరకు ఏ రాష్ట్రం నుంచి విడుదల కాలేదు. సిబ్బంది జీతాలు, టెలిమెట్రీ, వైజాగ్‌కు బోర్డు కార్యాలయం తరలింపు ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కో రాష్ట్రం కనీసం రూ.10 కోట్లు విడుదల చేయాలని బోర్డు కోరనుంది. జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త జల సంవత్సరంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై సమావేశంలో చర్చించనున్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు 50 శాతం చొప్పున వినియోగించుకొనేలా ఉండాలని తెలంగాణ కోరుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నీటి సంవత్సరంలో  రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపుపై నిర్ణయం జరగనుంది. ఒక సంవత్సరంలో కేటాయించి వినియోగించుకోలేని నీటిని తదుపరి సంవత్సరంలో వినియోగించుకొనేందుకు అనుమతించాలని తెలంగాణ కోరుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించడం లేదు. దీనిపై కేంద్ర జలసంఘం ఓ కమిటీని నియమించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో బోర్డు ముందుకు మళ్లీ ఈ అంశం రానుంది. వరద వచ్చినపుడు రిజర్వాయర్ల నుంచి మళ్లించే నీటిని లెక్కలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, తెలంగాణ దీనికి అంగీకరించలేదు. ఈ  అంశం మళ్లీ బోర్డు ముందుకు చర్చకు వస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు