ఇంటింటి సర్వేతోసత్ఫలితాలు: వినోద్‌కుమార్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటింటి సర్వేతోసత్ఫలితాలు: వినోద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే సత్ఫలితాలను ఇస్తోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. సర్వేలపై శుక్రవారం ఆయన కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ తదితర జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమగ్ర కుటుంబ సర్వే స్థాయిలో ఇంటింటా ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు వైద్యులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో సర్వేకు సీఎం ఆదేశించారన్నారు. దానిద్వారా సమగ్ర సమాచారం తెలుస్తోందని చెప్పారు. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

కరోనా నుంచి కోలుకున్న మంత్రి కొప్పుల
రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దంపతులు కరోనా నుంచి కోలుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు