పది రోజుల సమయం కావాలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పది రోజుల సమయం కావాలి

విద్యుత్తు బిల్లు ముసాయిదాపై ప్రభుత్వంతో చర్చించాలి
కేంద్రానికి ట్రాన్స్‌కో జేఎండీ నివేదన

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు బిల్లు 2021 ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉందని, ఇందుకు మరో పదిరోజుల సమయం కావాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు కేంద్రానికి స్పష్టం చేశారు. కేంద్రవిద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు సేకరించేందుకు శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం తరఫున జేఎండీ శ్రీనివాసరావు సమావేశానికి హాజరయ్యారు. ‘బిల్లు ముసాయిదా మాకు చేరి ఎన్నో రోజులు కాలేదు. దీనిపై అవగాహన వచ్చేందుకు మరికొంత సమయం అవసరమవుతుంద’ని ఆయన స్పష్టంచేశారు. సమావేశంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల వారు దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గత ఏడాదిగా
విద్యుత్తు చట్టం ముసాయిదాను రూపొందించిన కేంద్రం వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తూ వస్తోంది. దీనికోసం ఆ రంగానికి సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్ని రాష్ట్రాల ఇంధన కార్యదర్శులు, విద్యుత్తు సంస్థల సీఎండీలతో సమావేశం నిర్వహించింది. ఇందులో తెలంగాణ తరఫున సీఎండీ ప్రభాకరరావు పాల్గొన్నారు. విద్యుత్తు సంస్థల ప్రయివేటీకరణను, వ్యవసాయమీటర్లకు బోర్లు ఏర్పాటు చేసే అంశాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని కేంద్రానికి నివేదించారు. అనంతరం కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శికి కూడా లేఖ రాశారు. ముసాయిదాలో అంశాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది జూన్‌ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు