చికెన్‌, గుడ్లపై దుష్ప్రచారం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చికెన్‌, గుడ్లపై దుష్ప్రచారం

వదంతులపై చర్యలు తీసుకోండి
మంత్రి హరీశ్‌రావుకు కోళ్ల ఫారాల బ్రీడర్ల సమాఖ్య వినతి

ఈనాడు, హైదరాబాద్‌: చికెన్‌, కోడిగుడ్లు తింటే కరోనా వస్తుందని సోషల్‌ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కోళ్ల ఫారాల బ్రీడర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ రంజిత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారంతో ప్రజలు వీటిని కొనుగోలు చేయడం లేదని, దీంతో నష్టాల పాలవుతున్నామని, ఈ వదంతులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చికెన్‌, గుడ్లు వంటి కోళ్ల ఉత్పత్తుల రవాణా వాహనాలను లాక్‌డౌన్‌లో ఎక్కడా ఆపకుండా చూడాలని మంత్రి హరీశ్‌రావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి సమాఖ్య ప్రతినిధులు మంత్రిని కలిశారు. తమ వినతిపత్రంపై మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు.

కోళ్లతో కరోనా రాదు
మరోపక్క కోళ్లకు కరోనా అన్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని, వాటితో కొవిడ్‌ రాదని పశుసంవర్ధకశాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్‌ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి చికెన్‌, గుడ్లు తరచూ తినాలని ఆయన సూచించారు. సమాఖ్య ప్రతినిధులు లక్ష్మారెడ్డితోనూ భేటీ అయ్యి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు