కొనుగోలుకు మెలిక.. వర్షాలతోమొలక!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనుగోలుకు మెలిక.. వర్షాలతోమొలక!

అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాల్లో జాప్యం.. రైతులకు అశనిపాతంలా పరిణమిస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం మొలకెత్తుతోంది. దీంతో రైతులు ఆ ధాన్యాన్ని అమ్ముకోలేక నష్టాలపాలవుతున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని దొమ్మాట ఐకేపీ కొనుగోలు కేంద్రానికి కొందరు రైతులు వరి ధాన్యాన్ని అమ్మకానికి తీసుకొచ్చారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ ధాన్యం మొలకెత్తింది. తేమ శాతం, తాలు ఎక్కువగా ఉందని కొర్రీలు పెడుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, ఈ లోపు వర్షాలు కురియడంతో మొలకెత్తి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, దౌల్తాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు