ప్రాణవాయువు వచ్చింది!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణవాయువు వచ్చింది!

రాష్ట్రానికి 120 టన్నుల ఆక్సిజన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆరో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాష్ట్రానికి 120 టన్నుల ద్రవ రూప ఆక్సిజన్‌ తీసుకువచ్చింది. ఒడిశాలోని కళింగనగర్‌ నుంచి రైలు ఆదివారం సాయంత్రం సనత్‌నగర్‌ కంటైనర్‌ డిపోకు చేరుకుంది. అందులోని ట్యాంకర్ల నుంచి పైపు ద్వారా లారీ ట్యాంకర్లలో ప్రాణవాయువు నింపి ఆసుపత్రులకు పంపించారు. గుజరాత్‌ నుంచి బయల్దేరిన ఐదో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ కంటైనర్‌ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గంటకు 60 కిమీ వేగంతో ప్రయాణించి తెలంగాణకు చేరుకున్నాయని ద.మ.రైల్వే తెలిపింది. ఈ రైళ్లు వేగవంతంగా, సజావుగా ప్రయాణించడానికి, 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు