Singer Jai Srinivas:జై శ్రీనివాస్‌ కన్నుమూత

ప్రధానాంశాలు

Singer Jai Srinivas:జై శ్రీనివాస్‌ కన్నుమూత

గాయకుడిని బలిగొన్న కరోనా

మంచిర్యాల, న్యూస్‌టుడే: సింగరేణి నల్ల నేలలో బుడి బుడి అడుగులు వేసి.. బతుకమ్మ పాటను హాలీవుడ్‌కు పరిచయం చేసి.. మంచి నేపథ్య గాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు గడించిన జై శ్రీనివాస్‌ (42) కన్నుమూశారు. నెల రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో పుట్టి పెరిగిన నేరెడు కొమ్మ శ్రీనివాస్‌ కొన్ని వందల పాటలు పాడారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ చిత్రం ‘వీధి’ సినిమాలో ఆయన పాడిన పాటతో సంగీత దర్శకుడు కీరవాణి దృష్టిలో పడ్డారు. జై సినిమాలో పాడిన ‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. పాటతో ఆయన జై శ్రీనివాస్‌గా పేరొందారు. శ్రీనివాస్‌ హాలీవుడ్‌లో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఐ లవ్‌ యూ బతుకమ్మ ఉయ్యాలో’.. అంటూ పాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని