ఉన్నత విద్యలో అగ్రస్థానం పొందాలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉన్నత విద్యలో అగ్రస్థానం పొందాలి

వీసీలతో దృశ్యమాధ్యమ సమీక్షలో గవర్నర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని ఉన్నతవిద్యలో అగ్రస్థానంలో నిలిపేందుకు విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని గవర్నర్‌ తమిళిసై పిలుపునిచ్చారు.  బోధనకే పరిమితం కాకుండా.. పరిశోధనలు, ఆవిష్కరణల నిలయాలుగా ఎదగాలన్నారు. కరోనా సంక్షోభ సమయంలో సైన్స్‌, సామాజిక శాస్త్రాల ఉమ్మడి పరిశోధనలపై దృష్టి సారించాలని చెప్పారు. గవర్నర్‌ బుధవారం రాజ్‌భవన్‌ నుంచి  రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. వర్సిటీల్లో విద్యాపరమైన సామాజిక బాధ్యతలు పెరగాలని, ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలు మరింత విస్తరించడం, గ్రామాల దత్తత లాంటి అంశాలను ప్రోత్సహించాలని గవర్నర్‌ సూచించారు. ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనలేని అణగారిన వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా వీసీలు ప్రగతి నివేదికలను సమర్పించారు. సమీక్షలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు