వృద్ధురాలి కంటిలో పొడవైన పురుగు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వృద్ధురాలి కంటిలో పొడవైన పురుగు

శస్త్రచికిత్స విజయవంతం

ఉడుపి, న్యూస్‌టుడే: ఓ మహిళ(70) కంటిలో నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవైన పురుగును వైద్యులు శస్త్రచికిత్స ద్వారా వెలికితీశారు. ఈ సంఘటన కర్ణాటకలోని ఉడుపిలో చోటుచేసుకుంది. ఉడుపిలోని ప్రసాద్‌ కంటివైద్యాలయ వైద్యులు కృష్ణప్రసాద్‌, అపర్ణ నాయక్‌ ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. వృద్ధురాలు ఈ నెల 1న కన్ను నొప్పిగా ఉందంటూ ప్రసాద్‌ నేత్రాలయ వైద్యులను సంప్రదించారు. ఆమె కంటిలో పురుగు ఉన్న విషయాన్ని వైద్యుడు కృష్ణప్రసాద్‌ గుర్తించారు. ఆదివారం శస్త్రచికిత్స చేసి, తొమ్మిది సెంటీమీటర్ల పురుగును వెలికితీశారు. ఆ క్రిమిని మరింత లోతుగా పరీక్షించేందుకు ప్రయోగశాలకు పంపినట్లు వైద్యులు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు