ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌కు సీఎం కేసీఆర్‌ పరామర్శ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌కు సీఎం కేసీఆర్‌ పరామర్శ

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. సుమన్‌ తండ్రి సురేశ్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ జగిత్యాల జిల్లా మెట్పల్లి అనుబంధ గ్రామం రేగుంట వెళ్లి బాల్క సుమన్‌ను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. సురేశ్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. దాదాపు అరగంట పాటు సుమన్‌ కుటుంబ సభ్యులతో గడిపారు. అక్కడున్న మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సురేశ్‌రెడ్డి, వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్ల క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయడంపై జడ్పీ అధ్యక్షురాలు వసంత సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ రవిని జిల్లాలో కరోనా పరిస్థితులపై కేసీఆర్‌ ఆరా తీశారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ ద్వారా రావాల్సి ఉండగా హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం గుండా మధ్యాహ్నం 3.35 గంటలకు రేగుంటకు చేరుకున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు