లయన్స్‌ క్లబ్‌ 200 ఆక్సిజన్‌ సాంద్రత యంత్రాల విరాళం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లయన్స్‌ క్లబ్‌ 200 ఆక్సిజన్‌ సాంద్రత యంత్రాల విరాళం

మంత్రి కేటీఆర్‌కు అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా  నివారణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా హైదరాబాద్‌ లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ రూ.కోటి విలువైన 200 ఆక్సిజన్‌ సాంద్రత యంత్రాలను విరాళంగా ఇచ్చింది. గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావుకు సంస్థ ప్రతినిధులు అందజేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా సాయం అందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అవసరమున్న ఆసుపత్రులు, బాధితులకు ఇస్తామని తెలిపారు.
న్యాయమూర్తుల సంఖ్య పెంపుదలపై వినోద్‌ హర్షం
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచాలని నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని