కరోనాకు మరో ఔషధం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాకు మరో ఔషధం

మోల్నుపిరవిర్‌ ఉత్పత్తికి ఐఐసీటీతో సువెన్‌ ఫార్మా ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ చికిత్సకు మరో ఔషధం మార్కెట్లోకి రాబోతోంది. ఇన్‌ఫ్లూయంజా చికిత్సలో ఉపయోగించే యాంటివైరల్‌ ఔషధం మోల్నుపిరవిర్‌పై హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కొంతకాలంగా పరిశోధన చేస్తోంది. పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు చెందిన తిరువనంతపురంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఐఎస్‌టీ) నుంచి సింథటిక్‌ ప్రాసెస్‌ సాంకేతికతను తీసుకుంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన సాంకేతికతను సువెన్‌ ఫార్మాకు బదిలీ చేశాయి. దీనిపై మూడు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కొవిడ్‌ రోగుల్లో ఆక్సిజన్‌ అవసరాన్ని గణనీయంగా తగ్గించే 2డీజీ ఔషధం సాంకేతికతను సైతం సువెన్‌ ఫార్మాకు ఐఐసీటీ బదిలీ చేసింది. ఈ రెండు ఔషధాలను ఆ సంస్థ త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. కాగా, మోల్నుపిరవిర్‌ 24 గంటల వ్యవధిలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు నేచర్‌ మైక్రోబయాలజీ జర్నల్‌లో పరిశోధన పత్రం ప్రచురితమైంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు