28 రోజుల్లో 2.28 లక్షల వాహనాల జప్తు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

28 రోజుల్లో 2.28 లక్షల వాహనాల జప్తు

ఈసారికి జరిమానాతో విడుదలకు అధికారుల యోచన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన గత నెల 12 నుంచి ఈ నెల 8 వరకు అకారణంగా రోడ్లపైకి వచ్చిన 2.28 లక్షల వాహనాల్ని పోలీసులు జప్తు చేశారు. వీటిలో 80 శాతానికిపైగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. గత ఏడాది లాక్‌డౌన్‌లో నెల రోజుల్లో 1.46 లక్షల వాహనాలు జప్తు కాగా.. ఈసారి అంతకన్నా ఎక్కువగా పట్టుబడడం గమనార్హం. తమ వాహనాల్ని ఎప్పుడు ఇస్తారోనని యజమానులంతా ఎదురుచూస్తున్నారు. జప్తు అయిన వాహనాల యజమానులపై కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరచాలని అధికారులు తొలుత భావించినా.. ఆ ప్రయత్నాన్ని ప్రస్తుతం విరమించుకున్నట్లు తెలిసింది. ఆయా వాహనాలకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించి విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. లాక్‌డౌన్‌ పూర్తిగా తొలగించాక.. యజమానులు ఆన్‌లైన్‌లో లేక మీసేవ కేంద్రంలో జరిమానా చెల్లించి రశీదును సంబంధిత ఠాణాలో చూపిస్తేనే వాహనాలను వదిలే యోచనలోఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని