డిజిటల్‌ భూ సర్వేకు మరికొంత సమయం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిజిటల్‌ భూ సర్వేకు మరికొంత సమయం

గ్రామాల ఖరారు, సంస్థల ఎంపికలో జాప్యమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 27 గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన పైలట్‌ డిజిటల్‌ భూ సర్వేకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ సర్వే చేపట్టడానికి ముందు పైలట్‌ సర్వే నిర్వహించి ఫలితాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గజ్వేల్‌ నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో సర్వే చేపడతామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. మిగతా 24 గ్రామాల ఖరారుకు మంత్రులు, వారు లేని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఒక్కో గ్రామం పేరు ఇవ్వాలని సీఎం సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి రెవెన్యూ శాఖకు గ్రామాల పేర్లు అందలేదు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం తీరిక లేకుండా ఉండటంతో గ్రామాల ఎంపికలో ముందడుగు పడలేదు. ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే చేపట్టేందుకు ప్రైవేటు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు ఈ నెల 12 వరకు గడువు ఇచ్చారు. ఇది కూడా జాప్యానికి కారణమైంది. ఆ సంస్థల నుంచి పత్రాలు స్వీకరించి 14 లేదా 15న ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అనంతరం ఒకటీ రెండు రోజుల్లో పైలట్‌ సర్వే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు