జర్నలిస్ట్‌ రఘుపై అక్రమ కేసు ఎత్తేయాలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జర్నలిస్ట్‌ రఘుపై అక్రమ కేసు ఎత్తేయాలి

డీజీపీకి పలువురు ప్రముఖుల లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: జర్నలిస్ట్‌ రఘుపై పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరింపజేయాలని పలువురు ప్రముఖులు డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొ.హరగోపాల్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రొ.కోదండరాం, ప్రొ.విశ్వేశ్వరరావు, రమా మెల్కొటే, సీనియర్‌ జర్నలిస్ట్‌లు రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌, అఖిలేశ్వరి, పర్యావరణవేత్త ప్రొ.పురుషోత్తంరెడ్డిలు గురువారం లేఖ రాశారు. డీకే బసు వర్సెస్‌ పశ్చిమబెంగాల్‌ కేసులో 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ అరెస్ట్‌ జరిగిందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని