16 నుంచి పది, ఇంటర్‌ ఆన్‌లైన్‌ పాఠాలు!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

16 నుంచి పది, ఇంటర్‌ ఆన్‌లైన్‌ పాఠాలు!

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతితోపాటు ఇంటర్‌ ఆన్‌లైన్‌ పాఠాలను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా టీశాట్‌, దూరదర్శన్‌, విద్యాశాఖలో భాగమైన రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ(సైట్‌) అధికారులతో చర్చించారు. రెండు రోజుల్లో విద్యాశాఖ తేదీలను అధికారికంగా ప్రకటించనుంది. ఈసారి ఇంటర్‌ విద్యార్థులకు టీవీ పాఠాలు కొనసాగిస్తూనే అధ్యాపకులను బోధనలో అధిక భాగస్వామ్యం కల్పించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని