తిరుమలలో గదుల  కేటాయింపు సులభతరం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమలలో గదుల  కేటాయింపు సులభతరం

రేపటి నుంచి అందుబాటులోకి 12 నూతన రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు

తిరుమల, న్యూస్‌టుడే: భక్తుల సౌకర్యార్థం శనివారం ఉదయం 8 గంటల నుంచి తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో వసతి గదుల కోసం పేర్లు నమోదు (రిజిస్ట్రేషన్‌) చేసుకునే అవకాశాన్ని తితిదే కల్పిస్తోంది. ఇప్పటివరకు తిరుమలలో వసతి కోసం సీఆర్వో వద్ద పేర్లు నమోదు చేసుకున్న వారికి గదులు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. నూతనంగా జీఎన్‌సీ టోల్‌గేట్‌ సమీపంలోని లగేజ్‌ కౌంటర్‌ వద్ద, బాలాజీ మెయిన్‌ బస్టాండ్‌ వద్ద, కౌస్తుభం అతిథి భవనంవద్ద ఉన్న కారు పార్కింగ్‌ ప్రాంతంలో, రాంభగీచ బస్టాండ్‌ సమీపంలో, ఎంబీసీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద, సీఆర్వో వద్ద రెండేసి చొప్పున కౌంటర్లలో భక్తులు వసతి కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తి చేసింది. పేర్లు నమోదు చేసుకున్న వారికి ఎస్సెమ్మెస్‌ ద్వారా కేటాయించిన గదుల సమాచారం తెలియజేస్తారు. అనంతరం వారికి కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చు. తిరుమల శ్రీవారిని బుధవారం 11,770 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం పెరిగి రూ.1.34 కోట్లు లభించింది. ఈ నెలలో ఇదే అత్యధికం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు