కుల, చేతివృత్తుల వారికిరుణాలివ్వాలి: ఆర్‌.కృష్ణయ్య
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుల, చేతివృత్తుల వారికిరుణాలివ్వాలి: ఆర్‌.కృష్ణయ్య

కాచిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని కుల, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌తో కులవృత్తుల వారికి ఉపాధి కరవైందని, ఆకలిచావులు సంభవించే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల రాయితీ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. గురువారం కాచిగూడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్‌కు మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న 5.77 లక్షల మందికి రుణాలు అందజేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 బీసీ కులాలకు ఫెడరేషన్లు ఉన్నాయని, వీటిని కార్పొరేషన్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు