‘పీఆర్సీ జీవోలు త్వరగా ఇవ్వండి’
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పీఆర్సీ జీవోలు త్వరగా ఇవ్వండి’

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి త్వరగా జీవోలు జారీ చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును పీఆర్‌టీయూ తెలంగాణ కోరింది. ఈ మేరకు శాసనమండలి మాజీ చీఫ్‌ విప్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.చెన్నయ్య తదితరులు గురువారం మంత్రికి వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛను వర్తింపజేయాలని, ప్రతి ఉన్నత పాఠశాలకు కంప్యూటర్‌ ఇచ్చి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు