ఆన్‌లైన్‌ బోధనలో సహకారం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆన్‌లైన్‌ బోధనలో సహకారం

ట్రస్మా, ప్రాక్టికల్లీ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యను సమర్థంగా అందించడమే లక్ష్యంగా తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా), ప్రాక్టికల్లీ సంస్థ గురువారం ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్రంలోని ట్రస్మాలో భాగమైన పదివేల పాఠశాలల్లోని 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు, 33 లక్షల మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో ఆన్‌లైన్‌లో బోధన, శిక్షణ అందించడం ఒప్పందం లక్ష్యమని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరిశేఖర్‌రావు వెల్లడించారు. ఆ సంస్థ రూపొందించే 3డీ సాంకేతికతతో పాఠాలు, ఇతర నూతన పద్ధతుల ద్వారా విద్యార్థులకు బోధన అందిస్తామన్నారు. కొత్తగా వచ్చే సాంకేతికత, డిజిటల్‌ ఉపకరణాల వినియోగంపై ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రాక్టికల్లీ సహ వ్యవస్థాపకురాలు, సీవోవో చారునోహిరియా తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు