ఆర్టీసీ ఉద్యోగులకూ న్యాయం చేయాలి
close

ప్రధానాంశాలు

ఆర్టీసీ ఉద్యోగులకూ న్యాయం చేయాలి

ప్రభుత్వానికి కార్మిక సంఘాల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: సమన్యాయం ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన సవరణ అమలు చేయాలని ఆర్టీసీ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు శనివారం ఒక ప్రకటనలో కోరారు. విద్యుత్తు సంస్థ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ, 35 శాతం ఫిట్‌మెంట్‌ వర్తింప చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించినట్లుగా వేతన సవరణను అమలు చేయాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.తిరుపతి, ఎ.ఆర్‌.రెడ్డి కోరారు. మే నెల జీతాలను కూడా వెంటనే విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.  
20న అన్ని సంఘాలతో సమావేశం
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల 20న ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేతన సవరణ, జీతాల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారానికిఅనుసరించాల్సిన వ్యూహంపై ఆ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని