చివరి వారంలో డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా
close

ప్రధానాంశాలు

చివరి వారంలో డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా

వికారాబాద్‌ నుంచి ప్రారంభం: జయేశ్‌రంజన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఈ నెల చివరి వారంలో డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు ఔషధాల రవాణా ప్రాజెక్టు వికారాబాద్‌ నుంచి ప్రారంభమవుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని, అత్యవసర సమయాల్లో రవాణా సమస్యలను అధిగమిస్తుందని తెలిపారు. డ్రోన్ల ద్వారా ఔషధాల రవాణాపై శనివారం ఐటీ శాఖల నిర్వహించిన దృశ్యమాధ్యమ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు లభించాయని తెలిపారు. నీతి ఆయోగ్‌ సలహాదారు అన్నారాయ్‌, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అంబర్‌ దుబె, వికారబాద్‌ కలెక్టర్‌ పౌసమిబసు, తెలంగాణ ప్రభుత్వ నవీన సాంకేతిక విభాగం సంచాలకురాలు రమాదేవిలు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని