పీఆర్‌సీ బకాయిలు వాయిదాల్లో చెల్లించండి
close

ప్రధానాంశాలు

పీఆర్‌సీ బకాయిలు వాయిదాల్లో చెల్లించండి

ఉద్యోగుల ఐక్యవేదిక వినతి

ఈనాడు, హైదరాబాద్‌:  పీఆర్‌సీ బకాయిలను ఉద్యోగ విరమణ సందర్భంగా కాకుండా పీఆర్‌సీ కాలపరిమితి ముగిసే 2023 జూన్‌లోపు సమాన వాయిదాల్లో చెల్లించాలని తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు, ఒప్పంద ఉద్యోగుల ఐక్యవేదిక ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు విన్నవించింది. ఈ మేరకు స్టీరింగ్‌ కమిటీ నేతలు సీహెచ్‌.సంపత్‌కుమారస్వామి, జి.సదానందంగౌడ్‌, కె.జంగయ్య, మైస శ్రీనివాసులు, చావ రవి, పర్వతరెడ్డి, నిర్మల శనివారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.  బకాయిలను వెంటనే చెల్లించేలా జీవోలను సవరించాలని డీటీఎఫ్‌  డిమాండ్‌ చేసింది. సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబ పింఛను ఉత్తర్వులను సవరించాలని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం కోరింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని