ప్రాణాలు పణంగా పెట్టాం.. అన్యాయం చేస్తారా!
close

ప్రధానాంశాలు

ప్రాణాలు పణంగా పెట్టాం.. అన్యాయం చేస్తారా!

పీఆర్సీపై వైద్యశాఖ ఒప్పంద ఉద్యోగుల ఆవేదన

ఈనాడు, హైదరాబాద్‌ : కొవిడ్‌పై పోరులో 16 నెలలుగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్నామని,  అయినా వైద్య ఆరోగ్య శాఖ ఒప్పంద (కాంట్రాక్ట్‌,  ఔట్‌ సోర్సింగ్‌) ఉద్యోగులకు పీఆర్సీలో అన్యాయం చేస్తారా.. అంటూ తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి భూపాల్‌, కె.యాదనాయక్‌లు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 11న జారీ చేసిన ఉత్తర్వుల్లో జీవో సంఖ్య 60లో గతంలో మాదిరిగానే మూడు స్లాబులు పెట్టి వేతనాల్లో అన్యాయం చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశించినప్పటికీ పట్టించుకోకుండా అరకొర వేతనాలు ఇస్తున్నారన్నారు. గత ఇరవై ఏళ్ల నుంచి ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు అన్ని అర్హతలున్నా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ల నుంచి ఒప్పంద వైద్యులు, పారిశుద్ధ్య కార్మికుల వరకు అందరికీ అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా పీఆర్సీని సవరించి వేతనాలు పెరిగేలా చూడాలని, లేదంటే కలసి వచ్చే సంఘాలతో దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు వారు చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని